ముగ్గురూ మూడు ప్రాంతాల నుండి యూనివర్సిటీ చదువుకోసం వచ్చిన విద్యార్థులు. గాఢ స్నేహితులయ్యారు. చదువు పూర్తయ్యాక కూడ ఉమ్మడిగా ఉంటూ పోటీ పరీక్షలు రాస్తూ, ఉద్యోగవేట చేసేవారు. కానీ ఏ పరీక్షలోనూ వాళ్ళు నెగ్గలేకపోయారు. కాలం వాళ్ళని వెక్కిరించింది. వయసుకూడా ముదురుతోంది. ఖర్చుల సమస్య వారిని వెంటాడింది. అప్పుడు ఏం జరిగింది? ఆ ముగ్గురూ ఏకతాటిపై నిలబడ్డారా?

కృషిపాండ్రంకి సుబ్రమణిగోపాలకృష్ణ రాయలసీమ సరిహద్దున ఉన్న గంగవరం నుండి భాగ్యనగరం వచ్చి గ్రాడ్యుయేషన్‌ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చేరాడు. శ్రీకాకుళం వంశధార ప్రాంతమైన గవ్వలూరు నుండి చంద్రవెూహన్‌, ముమ్మడివరం నుండి అర్చక కుటుంబానికి చెందిన ఆంజనేయులు కూడా దూర ప్రదేశం అనే ఆలోచనలకు తావివ్వకుండా, అదే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు. మండేఎండల్లో ఎదురుచూడకుండా చిమ్మే తొలకరి చినుకుల్లాంటివి కొన్ని పరిచయాలు. ఒకరోజు ముగ్గురూ లైబ్రరీ హాలులో పుస్తకాలు వెతుక్కుంటున్నప్పుడు, ఒకరికొకరు ఎదురయ్యారు. ఊరూ పేరూ చెప్పుకుని దగ్గరయ్యారు. ఏకాకితనాన్ని ఆమడదూరంనెట్టి, చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుని ఊరట పొందారు.కాలక్రమాన వాళ్ళ స్నేహతీవెలెంతగా పెనవేసుకు పోయాయంటే ముగ్గురూ గ్రాడ్యుయేషన్‌ముగించుకొని హాస్టల్‌ విడిది నుండి బయటకొచ్చిన తర్వాత కూడా ఒకరినుండి మరొకరి దూరం కాలేకపోయూరు.

ముగ్గురూ కూడబలుక్కుని ఉవ్ముడి పోర్షన్‌లో మకాం పెట్టారు. వంటావార్పూ కలిసి చేసుకుంటూ సాధ్యమైనంత మేర ఖర్చులు మిగుల్చుకుంటూ ఉద్యోగాలవేటలో పడ్డారు. పోటీ పరీక్షలకి ఉమ్మడిగా సన్నద్ధం కాసాగారు.అదేం విచిత్రమో వాళ్ళ తలరాతలెంత వక్రవెూమరి ఎన్ని ప్రయాసలకోర్చి చదివినా పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నారు. మొదట మడమతిప్పని విక్రమార్కుల్లా సివిల్‌సర్వీసు పరీక్షలు వ్రాస్తే అందులో నెగ్గలేకపోయూరు. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించలేకపోయారు. ఇంకా ఏవేవో గ్రూప్‌ పరీక్షలు రాసినా వాటిలోనూ చుక్కెదురైంది. ఊపులోఊపుగా బ్యాంకు పోటీపరీక్షలకు కూడా హాజరయ్యూరు. ఫలితం షరా మామూలే అయింది.

ఎట్టకేలకు ఊరిస్తూ ఉసిగొల్పుతూవచ్చే పోటీపరీక్షలకు ఎగ్జామ్‌ ఫీజులు కట్టడానికి ఊరు నుంచి వచ్చే డబ్బులు కూడా సరిపోవడం లేదన్న వాస్తవాన్ని గుర్తించిన మిత్రులు ముగ్గురూ కాస్తంత డీలాపడ్డారు. తర్జనభర్జనలు పడ్డారు. ఇక తీరిగ్గా ఖర్చుల లెక్కలు చూసుకుని తమ సుఖాలను సౌఖ్యాలను తాత్కాలికంగా త్యాగం చేయుడానికి పూనుకున్నారు. ప్రతిరోజు రివాజుగా వండుకునే రెండురకాల కూరల్ని ఒకటికి తగ్గించారు. పెచ్చరిల్లిపోయిన పప్పుధాన్యాల ధరలకు దిమ్మతిరిగిపోయి జిహ్వచాపల్యం అణచుకున్నారు. విురియాలచారుతో, ఉల్లిపాయ పులుసుతో సరిపుచ్చుకోవాలని తీర్మానించారు. వారాని కొకసారి గుంపుగావెళ్ళి ఉత్సాహం పుంజుకువచ్చే సినిమాహాలునీ విడిచి పెట్టేశారు. మొత్తానికి తాము ప్రయోజకులమయ్యామని నిరూపించుకోవడానికి ఆ ముగ్గురూ అన్నీ చేశారు ఒక్కటితప్ప! అదే- పరీక్ష పాసవడం.