ఆమె స్నానానికి బయలుదేరింది. కావాలనే టవల్‌ తీసుకెళ్ళలేదు. అక్కడే కుర్చీలో వదిలేసింది. బాత్రూమ్‌లోకి వెళ్ళి దుస్తులన్నీ తొలగించి నగ్నంగా తయారైంది. ఆనక తీరిగ్గా స్నానం చేసింది. తలుపుమీద చప్పుడు చేసి అతడిని పిలిచింది. టవల్‌ మరచిపోయా తెచ్చివ్వు అంది. అతడు టవల్‌ తీసుకుని మెల్లిగా బాత్రూమ్‌ డోర్‌ దగ్గరకు వచ్చాడు. ఆమె తలుపు తెరచి అతడిని చూసింది. చటుక్కున....

తెల్లగా తెల్లారింది.ఆకాశం పరదాపై నెమ్మదిగా వెలుతురు కిరణాలు విరజిమ్ముతున్నాడు సూర్యుడు.పద్దెనిమిదేళ్ళ పడుచుపిల్లలా పరవళ్ళుతొక్కుతూ ప్రవహిస్తోంది యమునానది.ఏటి ఒడ్డున కొందరు పిల్లలు చేపలు పడుతున్నారు.వారిప్రయత్నాలు ఫలించినట్టు కొద్దిసేపటికి వారి గాలానికేదో తగులుకుంది.కానీ ఎంతలాగినా గాలం రావడంలేదు.గాలానికి ఏదో పెద్దచేపే తగులుకుందని పిల్లలు సంబరపడ్డారు. సహాయంకోసం దారినపోయే వ్యక్తిని పిలిచారు.అందరూ కలిసి కష్టపడి గాలం లాగారు. గాలానికి చిక్కుకున్న వస్తువు నీటిపై తేలింది.ఆ వస్తువును చూడగానే ఆ పిల్లలకు సాయంగా వచ్చినవ్యక్తి కంగారుగా చుట్టుపక్కలవారిని పిలిచాడు. కాసేపట్లోనే అక్కడ జనం గుమిగూడారు.

అందరూ కలిసి మూటను ఒడ్డుకుచేర్చి గబగబా మూట విప్పారు. చూడగానే వాళ్ళకళ్ళు బైర్లు కమ్మినట్టయ్యాయి.వణికిపోయారు. తెలియకుండానే భయంతో వారు కేకలు పెట్టారు. ఆ మూటలో ఓ యువకుడి శవం ఉంది!ఎవరో చంపి, యువకుణ్ణి మూటకట్టి నదిలోపారేసినట్టున్నారు. ప్రవాహంలో కొట్టుకొచ్చి పిల్లల గాలానికి తగులుకుంది.కొందరు యువకులు జమునాపార్‌ పోలీస్‌స్టేషన్‌కు ఈ విషయం తెలియజేశారు.సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆరోరా వెంటనే తన సిబ్బందితో రంగప్రవేశం చేశాడు.పోలీసు ఫొటోగ్రాఫర్‌ తన పని ముగించాక, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆరోరా, శవ పంచనామా చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు.

పోలీసు దర్యాప్తులో హతుడి వివరాలేమీ దొరకలేదు.ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతన్ని ఎవరు హత్యచేశారు? ఎందుకు హత్య చేశారు?ప్రేమా? ఆస్తి తగాదాలా? అక్రమ సంబంధమా?ఇలాంటి ప్రశ్నలతో రోజంతా సతమతమయ్యాడు సబ్‌ ఇన్స్‌పెక్టర్‌.మర్నాడు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చింది.పొత్తి కడుపులో బలమైన కత్తిపోట్లు, అధిక రక్తస్రావంవల్ల మరణించాడు. అంతేకాదు, హత్యకుముందు హతుడు సంభోగంలో పాల్గొనలేదని అయితే హతుడి నోట్లో దొరికినవి స్త్రీ కేశాలేనని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ పేర్కొంది.