కూతురుకు పెళ్ళి కుదిరిందని తెగ సంతోషపడిందామె. ఊళ్లో ఉన్న నలుగురితోనూ ఆ సంతోషం పంచుకోవడానికి వెళ్ళింది. ఆమె అన్నకూడా గాల్లోతేలిపోతూ పొలంపనులు చూసుకోవడానికి వెళ్ళాడు. కాబోయే పెళ్ళికూతురు ఒక్కర్తే ఇంట్లో ఉంది. తన బంగారు భవిష్యత్‌ గురించి కలలుకంటూ కూనిరాగాలు తీస్తోంది. కానీ అంతలోనే ఊహించనిరీతిలో జరిగిందాసంఘటన! ఇంతకూ ఏమిటది?

ఉలికిపడి కళ్ళు తెరచిందామె!ఒక్కక్షణం ఆమెకు జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు.కళ్ళు తెరవగానే తన ముఖానికి అతిసమీపంలో ఉన్న ముఖాన్ని చూడగానే ఆమె గుండె గుభేల్‌మంది.ఏదో తెలియని భయం ఆమెను నిలువునా ఒణికించింది.జరగరానిదేదో జరగబోతున్నట్టనిపించింది.కెవ్వుమని కేక వేయటానికన్నట్టు ఆమె నోరు తెరచింది.ఆ కేక బయటికి రాకుండా అతడు ఆమె నోటిని మూసేశాడు.భయంతో ఆమె కనురెప్పలు కొట్టుకోవడంచూసి, ‘‘భయపడకు నేనే’’ అంటూ ఆమెని ఆక్రమించుకున్నాడు. అరగంట తరువాత ఆ వ్యక్తి పిల్లిలా అడుగులు వేస్తూ ఆ గదినుంచి బయటకు వెళ్ళిపోయాడు.స్పృహలోకివచ్చిన బబిత తన జీవితాన్ని, భవిష్యత్‌ని తలుచుకుని దుఃఖంతో ఏడవసాగింది. తన లేతయవ్వనాన్ని మలినం చేసినవ్యక్తి కామేశ్వర్‌! కామేశ్వర్‌ ఎవరంటే....

బీహార్ పూర్ణియాజిల్లాలోని ‘ఘఢబకారి’ గ్రామస్థుడు రామథన్‌. అదేజిల్లాకు చెందిన గఢియా బబయాకు చెందిన సరళతో అతని వివాహం జరిగింది. రామధన్‌ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమె జీవితం హాయిగా గడచిపోతోంది. కొడుకు పన్నెండేళ్ళ వాడయ్యాడు. కూతురుకు పదేళ్ళు.తమ కొద్దిపాటి పొలాన్నే చూసుకుంటూ సంతృప్తిగా జీవిస్తున్న రామధన్‌ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. భర్త మరణం సరళని కుదిపేసింది. పిల్లలతో పుట్టింటికి పోదామనుకుంది. కానీ వారి ఆర్థికపరిస్థితి కూడా అంతంతమాత్రమే. చేతికందని కొడుకు, ఎదుగుతున్న కూతురును తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది.

అదే సమయంలో కామేశ్వర్‌తో ఆమెకు పరిచయం కలిగింది. తమ పక్కనున్న ఎకరంపొలం కామేశ్వర్‌దే. పెళ్ళైన పదేళ్ళకు కూడా సంతానం కలగలేదన్న విచారంతో అతడి భార్య గతఏడాది బావిలోపడి చనిపోయింది. సరళ రోజూ తన పొలానికి వెళ్ళేది. వెంట పిల్లలూ వెళ్ళేవాళ్ళు.ఒకరోజు ఆమె ఒంటరిగా పొలానికి రావడం గమనించిన కామేశ్వర్‌ ఆమె దగ్గరికివెళ్ళి, పంటలు పండించడం ఆడదానికి అంతసులభమైన పనికాదని, పిల్లవాడు పొలంపని చేసేస్థాయికి ఎదిగేవరకు ఆమె పొలం పనులు తాను చూసుకుంటానని, వచ్చిన పంటలో తనకు సగంఇస్తే చాలనీ చెప్పాడు కామేశ్వర్‌. ఈ ప్రతిపాదన సరళకు నచ్చింది. కాలం గడుస్తున్న కొద్ది కామేశ్వర్‌, సరళ మధ్య చనువు పెరిగింది. పెళ్ళి చేసుకుంటానన్నాడు.