పుట్టినరోజు. కేక్‌ సిద్ధం చేసి ఆమెకోసం ఎదురుచూస్తున్నాడతను. బాత్రూమ్‌లో స్నానం చేస్తోందామె. మగాణ్ణి మత్తెక్కించి మోహంలో ముంచెత్తడంలో ఆమె సిద్ధహస్తురాలు. బాత్రూమ్‌ బయట కీహోల్‌లోంచి అతడు తన అందాలు ఆస్వాదిస్తున్నాడని ఆమెకు తెలుసు. అందుకే బాత్రూమ్‌ బోల్ట్‌కూడా బిగించలేదు. అనుకున్నంతా అయింది. తలుపుతీసి ఆమెను ఎత్తుకుని బెడ్‌మీద పడేశాడతను. ఇద్దరూ కౌగిలిలో పరవశించిపోతున్నారు. అంతలో....?

గోవాలో పెద్ద బిజినెస్ మాగ్నెట్ డేవిడ్ థామస్.నడి వయసు దాటినా మనిషి ధృడంగా ఉంటాడు. శృంగార కాంక్ష, అమ్మాయిలపై మోజు ఇంకా పోలేదు. గదిలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. పక్కనే అందంగా అలంకరించిన గులాబిరంగు బర్త్ డే కేక్‌ మీద ‘‘టు మోనా డార్లింగ్‌’’ అని వ్రాసి ఉంది.బర్త్ డే బేబీ మోనా షవర్ క్రింద జలకాలాడుతున్నా ఆమె ఆలోచనలు మాత్రం హాట్ హాట్ గా ఉన్నాయి. చల్లనినీళ్ళలో తడిసిన ఆమె ఆందాలు మరింత మెరిసి పోతున్నాయి.మగవాళ్ళలో మోహం రేకెత్తించడంలో మోనా సిద్ధహస్తురాలు.

బాత్రూమ్‌ కీ హోల్లోంచి డేవిడ్ తన అందాలను ఆశగా చూస్తున్నాడని ఆమెకు తెలుసు. అందుకే కావాలనే బాత్రూమ్‌బోల్ట్ వేయలేదు. మోనా అందాలను మైమరచి చూస్తున్న డేవిడ్‌ చెయ్యి అప్రయత్నంగా డోర్‌మీద పడి తలుపు తెరచుకుంది.‘‘ఓ గ్గాడ్’’ అంటూ వగలు వలకబోస్తూ టవల్‌ ఒంటికి చుట్టుకుంది మోనా. పాల నురుగుల ఆమె అందాలను ఆ టవల్ ఏ మాత్రం దాచలేకపోయింది. మోనాను చూడగానే మోహంతో వాటేసుకుని ఎత్తుకొచ్చి బెడ్ పై కుదేశాడు డేవిడ్‌. ‘‘యూ నాటీ...ఆ టేబుల్‌మీద కేక్ అలాగే వదిలేస్తావా’’ కొంటెగా అడిగింది మోనా. ‘‘టేబుల్‌మీద కేక్ కన్నా ముందు ఈ బెడ్‌ మీదున్న కేక్ నే నమిలి మింగేయాలని ఉంది’’ అంటూ కసిగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అతని కౌగిలిలో కరిగిపోతూ ఆతని కాంక్షను మరింతగా ఎగదోస్తొంది. మోనా. కాలింగ్‌బెల్ మోగడంతో రసభంగమైంది. ‘‘డ్రెస్ వేసుకో’’ అంటూ బెడ్రూమ్‌ తలుపుమూసి బయటకొచ్చాడు డేవిడ్‌.