‘‘ప్రతీకార హత్య అంటున్నారు’’ డిటెక్టివ్‌ శరత్‌తో చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌.తల ఊపాడు శరత్‌. ‘‘ఇది ప్రదీప్‌ హత్యకేసు. కానీ దీని గురించి తెలుసుకోవాలంటే పాత కథ అంతా నీకు తెలియలి’’అంటూ చెప్పడం ప్రారంభించాడు విజయ్‌.

‘‘సాంబయ్య, వీరయ్య ఇద్దరూ బాల్యస్నేహితులు. పెద్దయ్యాక వాళ్ళల్లో విభేదాలు వచ్చాయి. ఇద్దరూ చెరో పార్టీలో చేరారు. వాళ్ల విభేదాలు రాజకీయరంగు పులుముకున్నాయి. ఎన్నికలలో ఓసారి వీరయ్య గెలిచాడు. రెండోసారి సాంబయ్య గెలిచాడు. దాంతో మూడోసారి ఎన్నికలు ఉద్విగ్నమయ్యాయి. ఎన్నికల ముందు సాంబయ్య హత్యకుగురయ్యాడు. ప్రచారంలో ఉండగా, అతడికారులో డైనమైట్‌పెట్టి పేల్చేశారు. ఎన్నికలు వాయిదాపడ్డాయి. పరిస్థితి చక్కబడి ఎన్నికలు ప్రకటించగానే సాంబయ్య కొడుకు ప్రదీప్‌ తండ్రిస్థానంలో పోటీచేసి గెలిచాడు’’ వివరించాడు విజయ్‌.‘‘సాంబయ్యను హత్య ఎవరు చేశారో తెలిసిందా?’’ అడిగాడు శరత్‌.‘ఆరోపణలుతప్ప నిరూపణలు లేవు. అనుమానితులపేర్లు తప్ప ఆధారాలు లేవు. అందుకే అరెస్టులు లేవు.

వీరయ్య హత్య చేయించాడంటారు. కానీ ఆధారాలు లేవు. ప్రదీప్‌ గెలిచాక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. వాళ్ళమధ్య కక్షలు పెరిగాయి. హింస పెరిగింది. అప్పుడు సాంబయ్య హత్య జరిగింది’’‘‘ఎలా?’’‘‘సాంబయ్య తన ప్రేయసి దగ్గరకు వెళ్ళినప్పుడు అర్థరాత్రి వాళ్ళిద్దరినీ నరికి చంపారు. ప్రదీప్‌ సోదరే అతడి ప్రేయసి! చంపినవాళ్ళక్కూడా ఆ విషయం తెలియదు, పెద్ద గొడవ జరిగింది’’.‘‘ఇంట్రెస్టింగ్‌. కానీ వాళ్ళమధ్య వయసు తేడా చాలా ఉంటుంది కదా?’’ అడిగాడు శరత్‌.‘‘వాళ్లిద్దరికీ ఎలా పరిచయమైందో, ఆ రిలేషన్‌ ఎలా ఏర్పడిందో తెలియదు. కానీ సాంబయ్య హత్య జరిగినప్పుడు అతడి రహస్య ప్రియురాలు వీరయ్య కూతురే అని నిస్సందేహంగా నిర్ధారణ అయింది. దాంతో సాంబయ్య కొడుకు శివయ్య రంగప్రవేశం చేశాడు’’.