యలమంచిలి పుస్తకాన్ని ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య

గుంటూరు,02-07-2018: రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన ఆరుగాలం పుస్తకాన్ని ఈ నెల 8న విజయవాడలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు. డాక్టర్‌ శివాజీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగంలోని ఒడిదుడుకులు, రైతుల జీవనవిధానం, వివిధ దేశాల్లో వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలు.. జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా, బ్యాంకుల నుంచి రైతులకు ఇస్తున్న రుణాలు, రికవరీలు తదితర అంశాలపై అనేక పత్రికలకు విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. వీటిని ఆరుగాలం పేరుతో రైతు నేస్తం ఫౌండేషన్‌ పుస్తక రూపంలో తెచ్చింది. రైతునేస్తం పబ్లికేషన్‌ సంస్థ దీనిని ప్రచురించింది.