గోరటి వెంకన్న ఈ ఏడాది అరుణ్‌ సాగర్‌ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. జనవరి 2న పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకొంటారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, కె. శివారెడ్డి, ప్రసాదమూర్తి, మువ్వా శ్రీని వాసరావు, కుప్పిలి పద్మలతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక చేసింది. ఇదే రోజు సా.6నుంచి అరుణ్‌ సాగర్‌ బెస్ట్‌ జర్న లిస్ట్‌ అవార్ట్స్‌-2017 కార్యక్రమం జరుగుతుంది. తన్నీరు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, అల్లం నారాయణ, పాలగుమ్మి సాయినాథ్‌ తదితరులు పాల్గొంటారు.

- మీడియా అకాడమీ ఆఫ్‌ తెలంగాణ