హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: ఆకృతి ఆధ్వర్యంలో.. ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీచాప్లిన్‌ 128వ జయంతి సందర్భంగా... ప్రముఖ హాస్య నటుడు డాక్టర్‌ బ్రహ్మానందానికి ‘చార్లీచాప్లిన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు’ ప్రదానం, చాప్లిన్‌ సిల్వర్‌ హ్యాట్‌ బహూకరణ - 19-4-2017న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జరుగును. ఈ కార్యక్రమంలోఅతిథులుగా ఎస్‌.మధుసూదనాచారి (శాసన సభాపతి), జస్టిస్‌ బి.సుభాషణ్‌ రెడ్డి, కె.వి.రమణ హాజరవుతారు. హరికిషన్‌ మిమిక్రీ, మైమ్‌ కళాధర్‌ ప్రదర్శన, గురుస్వామి పేరడీ గీతాలు, సినీ మెలొడీస్‌ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.