విజయవాడ, 09-11-2018: ఈనెల 10, 11 తేదీల్లో విజయవాడ బందరురోడ్డులోని శేషసాయి కల్యాణమండపంలో అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించనున్నట్టు మాలక్ష్మి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్‌ తెలిపారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయ కవిసమ్మేళనంలో మొత్తం 150మంది కవులు పాల్గొంటారని, అందులో విదేశాల నుంచి 20 మంది పాశ్చాత్య కవులు హాజరుకానున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 134మంది కవులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కవి సమ్మేళనంలో 76 దేశాల నుంచి 600 మంది కవులు 107 భాషల్లో అందించిన 1111 కవితల సంపుటిని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.