హాస్యనటుడు బ్రహ్మానందానికి సత్కారం: సుబ్బిరామిరెడ్డి

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 4: వరంగల్‌ నగరంలో మార్చి 11న కాకతీయ కళావైభవం పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, సినీ నిర్మాత సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌ కోట తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా వేయిస్తంభాల గుడిలో సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకతీయుల వైభవంపై జాతీయ, రాష్ట్ర, స్థానిక కళాకారులతో కలిసి సుబ్బిరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అనేక మంది సినీ ప్రముఖులు వస్తారని.. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందాన్ని ఘనంగా సత్కరిస్తామని వెల్లడించారు.