గుంటూరు: జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న ప్రతి మాసం రచన కోసం కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం మార్నింగ్‌ స్టార్‌ కళాశాలలో కవి సమ్మేళనం జరుగుతుందని జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ఎప్‌ ఎం సుభాని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న సాయంత్రం 4 గంటలకు జిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో తెలుగు భాషాభివృద్ధిలో మనం అనే అంశం కవి సమ్మేళణం జరుగుతుందని, సమ్మేళనంలో పాల్గొనదలిచ్చినవారు తెలుగు అధ్యాపకులు గోవిందయ్యను 9966385583 లో సంప్రదించాలని కోరారు. పాల్గొనే వారందరికి జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని రచయితలు, రచయిత్రులు, కవులు, కవయిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.