రవీంద్రభారతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఉదయం 10 గంటలకు సాహిత్య సంస్థల సమావేశం నిర్వహిస్తున్నామని అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించే ఈ సమావేశానికి రాష్ట్రంలోని సాహిత్య సంస్థల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కావాలని ఆయన కోరారు. ఆదివారం అకాడమీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రతి జిల్లాలోని సాహిత్య సంస్థల ప్రతినిధులు పాల్గొనాలని సిధారెడ్డి కోరారు. మరిన్ని వివరాలకు అకాడమీ కార్యాలయ ఫోన్‌ నంబరు 040-29703142 ను సంప్రదించాలని కార్యదర్శి నరసింహారెడ్డి సూచించారు.