చిక్కడపల్లి, డిసెంబర్‌19(ఆంధ్రజ్యోతి): లేఖిని మహిళాచైతన్య సాహితీ సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి రచించిన ఒక కోయిల గుండె చప్పుడు కథానికల సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. గ్రంథాన్ని ఆంఽధ్రప్రదేశ్‌ కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ ఆవిష్కరిస్తారని, ముఖ్యఅతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య విచ్చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ప్రముఖ కవయిత్రి డా. వాసా ప్రభావతి, ఆచార్య దివాకర్ల రాజేశ్వరి తదితరులు పాల్గొంటారని వివరించారు.