హైదరాబాద్, సెప్టెంబర్ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సాంస్కృతిక రంగ సమస్యలపై చర్చించి,వాటి పరిష్కారం కోసం అవలంభించాల్సిన కార్యాచరణ రూపొందించేందుకు సెప్టెంబర్ 6న మక్దూం భవన్లో కళాకారుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు పల్లె నర్సింహ తెలిపారు. సాంస్కృతిక కళా రంగంలో సేవలు అందిస్తున్న కందిమళ్ల ప్రతాపరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, మాదాలరవి, మద్దినేని రమేష్ సదస్సులో ప్రసంగిస్తారని తెలిపారు. సదస్సును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రారంభిస్తారని వివరించారు.