చిక్కడపల్లి, డిసెంబర్‌26(ఆంధ్రజ్యోతి): రాగరాగిణి ఆర్ట్స్‌ అసోసియేషన్‌, త్యాగరాయగానసభ, తరుణ సాహితీ సమితి ఆధ్వర్యంలో పోలాప్రగడ సత్యనారాయణమూర్తి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డా. వోలేటి పార్వతీశానికి అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ఆసంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎంవీ రమణకుమారి, ప్రధానకార్యదర్శి ఎంవీ సుబ్బలక్ష్మి తెలిపారు. ప్రముఖ రచయిత,  నంది అవార్డుగ్రహీత, బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రొఫెసర్‌, కథలు, నవలలు అనేకం రాసినటువంటి పోలాప్రగడ సత్యనారాయణమూర్తి జయంతి సందర్భంగా ఈనెల 29న సాయంత్రం త్యాగరాయగానసభలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత్రి డా. ఆలూరి విజయలక్ష్మి హాజరవుతారని, కవి వాడ్రేవు సత్యప్రసాద్‌, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, లక్ష్మీనారాయణమూర్తి, సినీ నటుడు జెన్నీ పాల్గొంటారన్నారు.