రవీంద్రభారతి, డిసెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఎత్నిక్‌ థియేటర్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23న రవీంద్రభారతిలో సాయంత్రం 7గంటలకు కొలనులో కొలువైన యక్షిణులు నాటకాన్ని ప్రదర్శించనున్నట్టు సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం శాఖ కార్యాలయంలో నాటక ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువ దర్శకుడు శివరాం దర్శకత్వం వహించిన ఈ నాటకాన్ని లలిత్‌ మోహన్‌ రచించారు. తెలంగాణలో యువదర్శకుల ప్రతిభను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మామిడి హరికృష్ణ తెలిపారు. ఈ నాటకాన్ని అందరూ చూసి శివరాంను ఆశీర్వదించాలని కోరారు.