తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్‌పల్లి, నిజామాబాద్‌; తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కథా రచనపై ఒక్కరోజు కార్యశాల మార్చి 14న ఉ.10గం.ల నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయకళాశాల సమావేశ మందిరంలో జరుగుతుంది. ప్రారంభ సభకు ముఖ్య అతిథి పి.సాంబయ్య; విశిష్ట అతిథి నందిని సిధారెడ్డి; గౌరవ అతిథులు ఎ.రవీందర్‌రెడ్డి, కె.శివశంకర్‌, శంకరగిరి నారాయణస్వామి; కీలకోపన్యాసం కె.శ్రీనివాస్‌, సభాధ్యక్షులు వి.త్రివేణి. తర్వాతి సమావేశాల్లో నాళేశ్వరం శంకర్‌, స్వాతి శ్రీపాద, కాసుల పత్రాపరెడ్డి, బి.వి.ఎన్‌. స్వామి, పెద్దింటి అశోక్‌ కుమార్‌, నలిమెల భాస్కర్‌ తదితరులు పాల్గొంటారు.

- వి. త్రివేణి