రవీంద్రభారతి, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కళాకారుడు పండిత్‌ రవిశంకర్‌జీ శతజయంత్యుత్సవాలు ఈనెల 28న రవీంద్రభారతి వేదికగా జరగనున్నాయి. సంకీర్తన కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు సంస్థ జనరల్‌ సెక్రటరీ నవీన్‌కుమార్‌ తెలిపారు. వేడుకల్లో భాగంగా సితార్‌ , తబలా కచేరీలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు,