కవిసంధ్య నిర్వహణలో కవి పఠాభి శత జయంతి ఉత్సవం ఫిబ్రవరి 19న యానాంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ‘పఠాభి సాహిత్యం-ప్రాసంగికత’ అంశంపై ఒక రోజు జాతీయ సాహిత్య సదస్సు జరుగుతుంది. అత్తలూరి నర సింహారావు, సీతారాం, అదృష్ట దీపక్‌, వంశీకృష్ణ, వాడ్రేవు వీరలక్ష్మి దేవి, జోశ్యుల కృష్ణబాబు, దాట్ల దేవదానం రాజు తదితరులు పత్ర సమర్పణ చేస్తారు. శిఖామణి కీలక ప్రసంగం చేస్తారు.

- కవిసంధ్య