రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు - 2018 ప్రదానోత్సవం అక్టోబర్‌ 7న ఉ.11గం.లకు రొట్టమాకురేవు, కారేపల్లి, ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. అవార్డు గ్రహీతలు నారాయణస్వామి (‘వానొస్తద?’), బొల్లోజు బాబా (‘వెలుతురు తెర’), నిర్మలారాణి తోట (‘ఒక చినుకు కోసం’). సాయంత్రం కొత్త తరం కవులతో సంభాషణ ఉంటుంది. కె. శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, ఖమర్‌, జి. లక్ష్మీనరసయ్య, ప్రసేన్‌, ప్రసాదమూర్తి, సీతారాం, వంశీకృష్ణ, కటుకోజ్వల ఆనందాచారి, జీవన్‌, అన్వర్‌ తదితరులు పాల్గొంటారు.

యాకూ