శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవి ద్యాలయం తెలుగు శాఖ ఆగస్టు 30, 31 తేదీలలో ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల రూమ్‌ నెం.57లో సి.నారాయాణరెడ్డి సాహిత్యంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నది. ఆగస్టు 30 ఉ.10గం.ల నుంచి సదస్సు ప్రారంభమవుతుంది. ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా రామచంద్రం; విశిష్ట అతిథిగా ఎన్‌.గోపి; గౌరవ అతిథు లుగా టి.పాపిరెడ్డి, ఎస్వీ సత్యనారాయణ; ముగింపు సభలో నందిని సిధారెడ్డి పాల్గొంటారు. ఎండ్లూరి సుధాకర్‌, రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి, బన్న అయిలయ్య, జి. బాలశ్రీనివాసమూర్తి, సి.కాసీం, ఎస్‌. రఘు తదితరులు పత్ర సమర్పణ చేస్తారు.

- ఎస్‌. రఘు