‘శిఖామణి సాహితీ పురస్కారం-2018’కుగాను ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఎంపికయ్యారు. అక్టోబర్‌ 28న సా.5 గం.లకు యానాంలో జరిగే పురస్కార సభలో శ్రీకాంత శర్మ రూ.10వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకుంటారు. సభలో మల్లాడి కృష్ణారావు, కె. శివారెడ్డి, సుధామ, చందు సుబ్బారావు, సీతారాం తదితరులు పాల్గొంటారు.

- దాట్ల దేవదానంరాజు