తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జూలై 16న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌, ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ సిగ్నల్‌ వద్ద దోమలగూడ దారిలో గల హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ సమావేశ మందిరంలో ‘నేటి సాహిత్యం – ప్రజలు – రచయితల బాధ్యతలు’ అనే అంశంపై సదస్సు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన తెరవే జిల్లా శాఖలతో సమాలోచన జరుగుతుంది.

గాగోజు నాగభూషణం, కార్యదర్శి, తెరవే