కేంద్ర సాహిత్య అకాడమి, ధ్వని రైటర్స్‌ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో జూలై 9న ఉ.10గం.ల నుంచి మహబూబ్‌నగర్‌ పట్టణం మెట్టుగడ్డలోని లిటిల్‌ స్కా లర్స్‌ హైస్కూల్‌లోని కాళోజీ హాల్‌లో వలస సాహి త్యంపై ఒక రోజు సదస్సు జరుగుతుంది. స్వాగతం ఎస్‌.పి.మహాలింగేశ్వర్‌, అధ్యక్షత ఎన్‌.గోపి, ముఖ్య అతిథి బి.రాజారత్నం, ప్రారంభోపన్యాసం జలజం సత్యనారాయణ, కీలకోపన్యాసం అల్లం నారాయణ. మొదటి సదస్సుకు గుడిపాటి వెంకటేశ్వర్లు, రెండో సదస్సుకు జూకంటి జగన్నాథం అధ్యక్షత వహిస్తారు. గుంటిగోపి, పల్లేర్ల రాంమోహన్‌రావు, కొల్లాపురం విమల, జె.నీరజ, భీం పల్లి శ్రీకాంత్‌, పి.భాస్కరయోగి పత్రసమర్పణ చేస్తారు. అనంతరం సా.4గం.ల నుండి కవి సంధ్య కార్యక్రమంలో కవి కోట్ల వేంకటేశ్వరరెడ్డి  తన కవితలను చదివి వినిపిస్తారు.

- జలజం సత్యనారాయణ