రవీంద్రభారతి,జనవరి2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నగరంలోని భిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన  ఈ నెల 7న నగరంలో నిర్వహించే స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కల్చరల్‌ ఫెస్ట్‌-2018 పోస్టర్‌ ఆవిష్కరణ మంగళవారం రవీంద్రభారతి ప్రాంగణంలో జరిగింది.  సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సీనియర్‌ పాత్రికేయుడు పాశం యాదగిరి, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ ప్రసాదరావు తదితరులు హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు ఎం.శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, ఎ.ఎ.కె.అమీన్‌, ఎస్‌.మారన్న, శ్రీనివాస్‌, కె.వీరయ్య, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.