డెబ్భై సంవత్సరాలుగా సంస్కృత భాషా సాహిత్యాల వ్యాప్తికై, విశిష్టా ద్వైత సిద్ధాంత పరిరక్షణకై కృషి చేస్తున్న మహామహోపాధ్యాయ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి 92వ జన్మదినం సంద ర్భంగా సత్సంప్రదాయ పరిరక్షణ సభ పక్షాన శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాల్ని ఎస్‌వీ వేదిక్‌ యూనివర్సిటీ వీసీ కె.ఇ.దేవ నాథన్‌కు, హైదరాబాద్‌కు చెందిన ప్రతివాది భయంకరం అణ్ణంగరా చార్యకు అందిస్తున్నాం. ఈ సభ మే 14న సా.6గం.లకు హంటర్‌రోడ్‌ వరంగల్‌లోని కోడం కన్వెన్షన్‌ ఎ.సి.హాల్‌లో జరుగుతుంది. 

 

 

- సముద్రాల శఠగోపాచార్యులు