సమకాలీన కథపై రాష్ట్ర స్థాయి సదస్సు సెప్టెంబర్‌ 1 ఉ.9గం.ల నుంచి సా.5గం.ల వరకు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్టీఆర్‌ కళా క్షేత్రంలో జరుగుతుంది. పెనుగొండ లక్ష్మీనారా యణ, వాడ్రేవు చినవీరభద్రుడు, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, పాపినేని శివశంకర్‌, కాట్రగడ్డ దయానంద్‌, అద్దేపల్లి ప్రభు, సుంకోజీ దేవేంద్రాచారి, బా రహంతుల్లా, కొర్రపాటి ఆదిత్య, తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘మాయ జలతారు’ (సయ్యద్‌ సలీం), ‘సాహిల్‌ వస్తాడు’ (అఫ్సర్‌), ‘దేవర గట్టు’ (జి.వెంకట కృష్ణ), ‘హస్బెండ్‌ స్టిచ్‌’ (గీతాంజలి) కథా సంపుటాల ఆవిష్కరణలు జరుగుతాయి.

మంచికంటి