తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్‌ జిల్లా 5వ మహాసభల సందర్భంగా సెప్టెంబర్‌ 9 ఉ.10గంటల నుంచి సినారె ప్రాంగణం, బి.విజయ్‌కుమార్‌ ప్రెస్‌ భవన్‌, కరీంనగర్‌ నందు ‘తెలంగాణ భాష విశిష్టత - ఆధునికత, ప్రజలు’ అంశంపై ఒక రోజు సదస్సు జరుగుతుంది. కూకట్ల తిరుపతి సభాధ్యక్షతన ప్రారంభ సభలో రవ్వా శ్రీహరి, నగునూరి శేఖర్‌, జయధీర్‌ తిరుమలరావు, నలిమెల భాస్కర్‌, జూకంటి జగన్నాథం, సామల రమేష్‌ బాబు తదితరులు పాల్గొంటారు. రెండవ, మూడవ, ముగింపు సమావే శాల్లో పెద్దింటి అశోక్‌కుమార్‌, తెలిదేవర భాను మూర్తి, బూర్ల వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్‌, కె. ముత్యం, కాలువ మల్లయ్య, ఎ.కె.ప్రభాకర్‌, యాకూబ్‌ తదితరులు పాల్గొంటారు.

- సి.వి. కుమార్‌