సాహితీ గౌతమి కరీంనగర్‌ సంస్థ ఏప్రిల్‌ 21 ఉ.10గం.లకు కరీంనగర్‌ ఫిలింభవన్‌లో ‘కవి అంతరంగం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. నందిని సిధారెడ్డి కొత్త కవితా సంపుటి ‘నీటి మనసు’పై నందిని సిధారెడ్డి తన స్వీయ అనుభూతులతో అంతరంగ ప్రసంగం చేస్తారు. స్వీయ కవితలను వినిపిస్తారు. దేశపతి శ్రీనివాస్‌ అతిథి అంతరంగ ప్రసంగం చేస్తారు. శ్రీ వఝల శివకుమార్‌ సహృదయాంతరంగ ప్రసంగం చేస్తారు. సాహితీగౌతమి అధ్యక్షులు గండ్ర లక్ష్మణరావు సభాధ్యక్షత వహిస్తారు. సాహిత్యాభిమానులందరూ పాల్గొనగలరని మనవి. - గాజుల రవీందర్‌