హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): జీఎస్‌ రామకృష్ణ మిత్ర మండలి, సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక హైదరాబాద్‌ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు రామకృష్ణ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగే సమ్మేళనంలో పాల్గొనాలనుకునే వారు 24వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 99499 17216, 96665 45202 నెంబర్లలో సంప్రదించాలన్నారు.