విజయవాడ: త్యాగరాజస్వామి వారి ఆరాధనా సంగీతోత్సవం ఈ నెల 15వ తేది నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విజయవాడ మ్యూజిక్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి శీరం సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.సత్యనారాయణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ - భాషా సాంస్కృతిక శాఖ, వేదగంగోత్రి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘంటసాల ప్రభుత్వ కళాశాల వేదికగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎల్‌వి.సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 21వ తేదీ ఆదివారం ఉదయం సద్గురు త్యాగరాజ స్వామి పంచరత్న గోష్ఠి గానం, సాయంత్రం ఆంజనేయ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.