(ఆంధ్ర‌జ్యోతి, విజయవాడ): వేమనను మించిన కవి మరొకరు లేరని పాత్రికేయుడు, విశ్లేషకుడు తెలకపల్లి రవి అన్నారు. అనంతపురంలో ఈనెల 30న ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన పేరిట రాష్ట్ర సదస్సు నిర్వహిస్త్నుట్టు తెలిపారు. ఇందులో దాదాపు 200 సంఘాలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సందస్సులో వేమన సాహిత్య ప్రామాణిక గ్రంథాలను ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. తెలుగుకు పూర్వ వైభవం తెచ్చేందుకు వేమన కవిత్వాలను ప్రజలకు చాటి చెప్పాలన్నదే సదస్సు లక్ష్యమని తెలిపారు.