హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం 26వ మహాసభలను ఈ నెల 13, 14 తేదీల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని క్రౌండ్‌గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు సంఘం నేతలు వరవరరావు, గీతాంజలి, సీ కాశీం తెలిపారు. సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మహాసభలకు సంబందించిన పోస్టర్‌ను సోమవారం వారు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వరవరరావు మాట్లాడుతూ ఈ మహాసభలు ప్రధానంగా బ్రాహ్మణియ హిందూ పాసిజాన్ని ఓడిద్దాం అనే అంశంపైన సాగుతాయని తెలిపారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్‌ కాశీం, నగర కన్వీనర్‌ గీతాంజలి, విరసం సభ్యులు రాములు, అరవింద్‌ పాల్గొన్నారు.