గుంటూరు (సాంస్కృతికం): స్థానిక బృందావన గార్డెన్స శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణం ధ్యాన మందిరంలో ఈ నెల 23న ప్రపంచ పుస్తక మహోత్సవాల సందర్భంగా పుస్తక హుండీ ఏర్పాటు చేసినట్లు ఆలయకమిటీ కోశాధికారి లంకా సూర్యనారాయణ తెలిపారు. ఈ మహోత్సవాల సందర్భంగా ఇళ్లలో వృథాగా ఉన్న నవలలు, కావ్యాలు, శతకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు హుండీలో వేయాలని ఆయన కోరారు. అదే రోజు హైస్కూలు, కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను హుండీ నుంచి తీసి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.