05-01-2018 విజయవాడ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు సమాఖ్య 11వ ద్వైవార్షిక మహాసభలు, రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి 3, 4 తేదీలలో చెన్నైలో జరగనున్నాయని సమాఖ్య సెక్రటరీ జనరల్‌ జె.ఎం.నాయుడు చెప్పారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాఖ్య అధ్యక్షురాలు వి.ఎల్‌.ఇందిరాదత్తు అధ్యక్షతన ఈ సభలు జరగనున్నాయని. హాజరయ్యే ప్రతినిధులు రూ.750 చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని నాయుడు సూచించారు.