విద్యార్థులను తీర్చిదిద్దే అధ్యాపకుడు, జీవితాన్ని ఆవిష్కరించే కవి, జీవితాన్ని కవిత్వంగా మలుచుకుంటున్న, వస్తువైవిధ్యమున్న వర్ధమాన కవి మెట్టా నాగేశ్వరరావు. ఇప్పటికే ‘మెట్టా మాణిక్యాలు’ అనే 500 రుబాయీల సంపుటి వెలువరించారు. ఆయన తాజా కవితా సంపుటి ‘మనిషొక పద్యం’. పీడిత జనం కోసమే పుడతాయి పద్యాలు.../దిగులును తరిమేయాలనుకునే నీలోంచీ నాలోంచీ/ఆశను బతికించే కొత్త చిగుళ్ళ వనాలై మొలుస్తాయి...అటారాయన. మమతల పందిరివేసే/ప్రతి మనిషి ఓ పద్యమే/బడుగుల పక్షాన నిలబడి/వేకువకోసం తపించే ప్రతి మనిషీ పద్యమే! అంటారు. ఇందులోని 78 కవితలూ మనిషితనాన్నిచాటేవే. 

మనిషొక పద్యం

మెట్టా నాగేశ్వరరావు
ధర 180 రూపాయలు
పేజీలు 192
ప్రతులకు మెట్టా లక్ష్మీ ప్రసన్న, బయ్యన్నగూడెంపోస్ట్‌, కొయ్యలగూడెం మండలం. ప.గో.జిల్లా
సెల్‌ 99 510 85 760