మైమ్‌ (మూకాభినయం) అకాడమీ స్థాపకుడు కళాధర్‌. 35 ఏళ్ళుగా ఆయన ఈ కళకు అంకితమై వేలాది ప్రదర్శనలిచ్చారు.  తెలుగులో మొదటిసారి మైమ్‌ కళపై ఇలా పుస్తకం రాసిన ఘనత ఆయనదే. పలుదేశాల్లో ప్రాచుర్యం పొందిన మైమ్‌ కళమీద ఇంగ్లీషులో ఎన్నో పుస్తకాలున్నాయి. వాటికి దూరంగా, తన అనుభవాలనే పాఠాలుగా మార్చి ఈ పుస్తకం రూపొందించారు కళాధర్‌. మార్షల్‌ మార్సో, చార్లీ చాప్లిన్‌, టోనీ మేంటిలరో, రోవన్‌ అట్కిన్‌సన్‌ (మిస్టర్‌ బీన్‌) ఇర్షద్‌ పంజాతన్‌, (భారత్‌), జోగేష్‌ దత్‌ (భారత్‌) లాంటి ఎందరో ఈ రంగంలో కృషి చేశారు. ప్రతిఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకమిది. 

మూకాభినయం

కళాధర్‌
ధర 150 రూపాయలు
పేజీలు 88
ప్రతులకు విశాలాంధ్ర, నవచేతన, ఎమెస్కో, నవోదయ బుక్‌హౌస్‌, నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌