అంతర్గత కవిత చైతన్యం ... విశ్వావలోకనం

ఇది ‘నేను’గా సాగిన ఒక యౌగిక కావ్యం. మాటలూ ఆలోచనలూ అనుభుతులూ, తాత్విక చింతనలూ అన్నీ పరుగులు తీస్తూ ఒక ప్రయాణ భ్రమను కలిగించే దీర్ఘకావ్యం. పరిణామపథం, ప్రమోదపథం, ప్రమాణపథం, ప్రస్థానపథం అనే నాలుగు మార్గాల శీర్షికల్లో విశ్వరూపం దర్శనమిస్తుంది. శబ్దాల ప్రయోగాల్లోంచి ఆలోచనల కల్పనలూ, వాటిలో నుంచి అనిర్వచనీయ అనుభూతులూ కలగడంలో కలిగించడంలో రచయిత ‘సద్వినియోగకవి’ అయ్యారు.

- సన్నిధానం నరసింహశర్శ

విశ్వావలోకనం - నేను యౌగిక కావ్యం

రచన : విశ్వార్షి వాసిలి

పేజీలు : 151,

వెల : రూ. 150

ప్రతులకు : 93939 33946