2018లో వచ్చిన తెలంగాణ కథల్లోంచి ఎంపిక చేసిన ఆణిముత్యాల్లాంటి పదమూడు కథల సమాహారం ఈ తెలంగాణ కథల–2018 సంపుటి ‘రివాజు’. ఇందులోనివన్నీ అల్లాటప్పా కథలు కాదు, గుండెను పిండేస్తాయి, చరిత్రను చెబుతాయి, భవిష్యత్‌ను వివరిస్తాయి, తెలంగాణ సమాజ ముఖచిత్రాన్ని కళ్ళకు కడతాయి. సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్‌, డా.వెల్దండి శ్రీధర్‌ ‘రివాజు’ ముందుమాటలో చెప్పినట్టు, ఇవన్నీ బంగారు తీగెల్లాంటి కథలు. తెలంగాణ సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కథలివన్నీ. కష్టాలు, కన్నీళ్ళు, సుఖాలు, సంతోషాలు, సార్వజనీనమైన ప్రేమ...ఇవన్నీ కలగలిసినవే.

మరో పుస్తకం ప్రముఖ రచయిత డా.వెల్దండి శ్రీధర్‌ రాసిన 12కథల సంపుటి ‘పుంజీతం’. అతడి కథల్లో గ్రామీణ జీవన సంఘర్షణ కనిపిస్తుంది. ఇవన్నీ ఆ కోవకు చెందిన కథలే.  వర్తమాన గ్రామీణ జీవితంలో ఎదురైన విషాదాలను అక్షరీకరించిన ఈ కథల్లోని పాత్రలు మన కట్టెదుట సజీవంగా దర్శనమిస్తాయి. మచ్చుకు టైటిల్‌ కథ ‘పుంజీతం’లో అవసరంకోసమో, అప్పులు తీర్చడంకోసమో, డబ్బు ఆశతో 400 ఎకరాలు భూమిని ఒకర్నిచూసి మరొకరు మూకుమ్మడిగా అమ్ముకుని ఉనికిని పోగొట్టుకుని కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ కోరల్లో చిక్కుకున్న ఒక ఊరి కథ. గ్రామీణ అవస్థలను చాటిచెప్పే కథ.

 

రివాజు

తెలంగాణ కథ–2018

సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్‌, డా.వెల్దండి శ్రీధర్‌
ధర: 70రూపాయలు, పేజీలు : 132

పుంజీతం

కథలు

 

డా.వెల్డండి శ్రీధర్‌
ధర : 100రూపాయలు, పేజీలు : 112
ప్రతులకు: నవోదయ బుక్‌హౌ‍స్‌, కాచిగూడ క్రాస్‌రోడ్స్‌, హైదరాబాద్‌, మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు మరియు సంగిశెట్టి శ్రీనివాస్‌, అత్తాపూర్‌, హైదరాబాద్‌–48 మొబైల్‌ 98 49 220 321., వెల్దండి సురేఖ, రిట్రీట్‌కాలనీ, ఓల్డ్‌ ఆల్వాల్‌, హైదరాబాద్‌ సెల్‌ 98 669 77 41