శతాధిక గ్రంథకర్త, నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుగాంచిన సద్గురుమూర్తి కపిలవాయి లింగమూర్తి. పద్య, గద్య, గేయ, వచనాలు, శతకం, కథ, నవల, కావ్యం, ద్విపద, నాటకం, చరిత్ర, బాల్యసాహిత్యం, బుర్రకథ, ‌హరికథ, అనువాదం, పీఠికలు...ఇలా దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలనూ సాధించారు. అనేక పురస్కారాలు, బిరుదులు పొందారు. ఆయన తొంభైఏళ్ళ పండుగ (2018) సందర్భంగా లింగమూర్తిగారి జీవితం, సాహితీయాత్ర ఈ పుస్తకం. 

 
సాహితీవనంలో ఒక మాలి
డా.కపిలవాయి లింగమూర్తి
కూర్పు : డా.కొల్లోజు కనకాచారి
ధర : 180 రూపాయలు, పేజీలు : 190
ప్రతులకు : డా.ఎం.వి.వసంతరావు, 6–3–26/ఎ, రామగిరి, నల్లగొండ