చతుర్విధ కవితా ప్రక్రియల్లో ఒకటి చిత్రకవిత్వం. వాటిల్లో ఒకటి రథబంధ కవిత్వం. సంస్కృతంలో ఏడో శతాబ్దంలో, తెలుగులో 11వశతాబ్దంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆంగ్లంలో ఈ చిత్రబంధ కవిత్వాన్ని Figarative poetry/Image poetry అంటారు. భారతీయబంధకవితా వాజ్మయంలో తిరుమంగై ఆళ్వారు, కుంభకోణంలోని దారురథంమీద తొలిసారి ఈ రథబంధాన్ని రచించారు. ఇందులో ఎంతో చమత్కారం ఉంటుంది. రథం ఆకారంలో రాసే ఈ చమత్కార శతకాల్లో నిలువు అడ్డాల్లో రెండు రకాల అర్థాలు గోచరిస్తాయి. చమత్కారం ఉంటుంది. భారతీయాన్ని ఆవిష్కరింపజేసే ఈ చమత్కారాలు మనల్ని అబ్బురపరుస్తాయి. అసామాన్య కవి తిరువాయి చక్రపాణి తెలుగులో తొలిసారి దాదాపు 300సీసపద్యాలతో ఈ రథబంధ శతకం రాశారు.


తొలి తెలుగు రథబంధ శతకము

కృతికర్త కవి వరిష్ట తిరువాయిపాటి చక్రవాణి

ధర : 500రూపాయలు, పేజీలు : 340

ప్రతులకు : శ్రీమతి సముద్రపు విజయకుమారి, 

గాయత్రి టవర్స్‌, గాయత్రి ఎస్టేట్‌, కర్నూలు. ఆం.ప్ర.

సెల్‌ 988 51 960 86