విభిన్న జీవన శకలాలు

ప్రపంచమనే అద్దంలో మన జీవిత ప్రతిబింబాన్ని పారదర్శకంగా చూపించే కథలివి. వీటిల్లో కొన్ని మనల్ని ప్రశ్నిస్తాయి, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. పారిశ్రామికీకరణ నుంచి ఆర్థిక సంబంధాల వరకూ అంతర్యుద్ధం నుంచి అంత్యక్రియల వరకూ పలు జీవన శకలాలకు జీవన దృశ్యాలు ఇవి. 15 కథల ఈ సంకలనంలో దేనికదే ప్రత్యేకం. జీవితంలోని అన్ని కోణాలను ఈ సంకలనంలోని కథలు ఆవిష్కరించాయి. ‘కొరివి’, ‘భద్రం’, ‘మురికి’, ‘ప్రమాదం’ వంటి కథలు కొంతకాలం పాటు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. 

- వల్లూరి రాఘవరావు

కొరివి (కథలు), 

రచన: వల్లూరు శివప్రసాద్‌

పేజీలు: 120, వెల: రూ. 100, 

ప్రతులకు: విశాలాంధ్ర