నిత్యజీవితంలో తెలుగు జాతీయాలు

సమాజ స్వభావంలోని విలక్షణతకు జాతీయాలు ప్రతిబింబాలు. వాటిని తెలిసి ప్రయోగించడం భాషాభిమానానికి నిదర్శనం. గతంలో బూదరాజు రాధాకృష్ణ వంటివారు ఇలాంటి సంకలనాలను తీసుకొచ్చి తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వివిధ పోటీ పరీక్షలకి వెళ్లేవారికి ఇతోధికంగా ఉపయోగపడిన విషయం మనం మర్చిపోలేం. ‘అభ్యాసం కూసువిద్య’, ‘అత్తా ఒక్కింటి కోడలే’, ‘అడవి కాచిన వెన్నెల’, ‘అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు’ వంటి వేలాది జాతీయాలు ఇప్పటికీ తెలుగు ప్రజల నాలుకలపై సందర్భోచితంగా నడయాడుతూనే ఉన్నాయి. తెలుగు భాష మాట్లాడితే దేహంలో ఉన్న 72 వేల నాడులు ఉత్తేజితమవుతాయంటారు. మనం మాట్లాడే మాటలకు అదనపు హంగులు జాతీయాలతోనే సమకూరుతాయి. ఇలాంటి నూటా తొంభైమూడు జాతీయాల పూర్వపరాలు సేకరించి సంకలనం చేశారు రచయిత. డిజిటల్‌ లాంగ్వేజ్‌ మత్తులో ఉనికిని కోల్పోతున్న ఈ తరానికి ఇదొక కానుక. 


తెలుగు జాతీయాలు  
రచన : యం.వి. నరసింహారెడ్డి
పేజీలు : 148, వెల : రూ.100
ప్రతులకు: 99891 22035