హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 7వ తేదీ వరకు సాంస్కృతిక సారథిలో కళాకారుల నియామకాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు నియామక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించింది.