చెట్లన్నీ యెక్కడి కెగిరిపోతాయో తెలియదు

గూడు చేరినట్టే వుంటుంది పిట్ట
నేలనంతా వొంటికి పూసుకుంటుంది వొంటరి పాదం
రెండు సముద్రాలు యేమ్‌ మాట్లాడుకుంటాయో
యెవరూ నడవని దారులు స్ఫురిస్తాయి
జల్లెడ పట్టినట్టే ఆలోచనలు
యెడారి అంచులో నిలబడి శూన్యానికి సైగ చేస్తుంటాయి గాలి చేతులు
మొఖం నిండా మిణుగురులు అంటుకుని వెలగవు
కొండమీదకెక్కి చంద్రున్ని చప్పరించే నాలుక
నీటి నుండి ఆత్మ తేలి ముచ్చట పెడుతుంది
తలుపులు తెరవకుండా యెవరు చేస్తారో కానీ వూపిరి ఆడనియ్యదు చీకటి
శరీరమంత భూమిలా గుండ్రంగా మారడం తెలుస్తుంది
మెదడు చిట్లి
మబ్బు జరిపినట్టు
దుప్పటి పక్కకు విసిరికొట్టి
చూస్తే
ఖాళీతనంలోకి తోసినట్టే వొకటే కలలు
 
విజయ్‌ కుమార్‌ ఎస్వీకే
97033 35955