తెలుగు సమాజంలో గత రెండు మూడు దశాబ్దాలుగా విప్లవోద్యమంతో పాటు స్త్రీవాద ఆదివాసీ దళిత బహుజన ఆత్మగౌరవ ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షల ఉద్యమాలు తెచ్చిన మలుపుల మంచి చెడ్డలను విశ్లేషించు కొనే సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యటం లక్ష్యంగా ‘మలుపు ప్రచురణలు’ ఏర్పడింది. అన్యాయాలకు, అసమానతలకు వ్యతిరేకంగా తెలుగు సమాజం నిరంతరం జ్వలించటానికి అవసరమైన ‘ఇంధనం’ సమకూర్చే పుస్తకాల ప్రచురణ కార్యభారం నెత్తికెత్తుకొని మలుపును ఇంటిపేరు చేసుకొన్న బాల్‌ రెడ్డి, ఆయన మిత్రబృందం చేస్తున్న కృషి అభినందనీయం. 

ఈ ప్రయాణం మరొక పదేళ్లు, అనేక పదేళ్లు ఇలాగే కొనసాగాలి.ఒక జాతి జ్ఞాన చైతన్యాల వికాసంలో పుస్తక ప్రచురణ సంస్థల పాత్ర చెప్పుకోదగినది. వాస్తవికమూ, హేతుబద్ధమూ అయిన జ్ఞానాన్ని వినిమయంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఏర్పడే ప్రచురణ సంస్థలు సామాజిక బాధ్యతను భుజాలకెత్తు కుంటాయి. అందుకనే ఎంపికకు అనితర ప్రాధాన్యత. చదువరుల ఆలోచనా రీతిని, దృక్పథాన్ని విశేషంగా ప్రభావితం చేయగల సత్తా వాటికి ఉంటుంది. తెలుగు సమాజంలో అటువంటి ప్రచురణ సంస్థలు ‘హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌’, ‘పర్‌స్పెక్టివ్స్‌’, ‘మలుపు’. ఒకే ఆలోచనా విధానం కల బాల్‌ రెడ్డి తదితర మిత్రబృందం కలిసి 2010లో ప్రారంభించిన సంస్థ మలుపు. ఈ పదేళ్లలో ముప్ఫయ్‌ అయిదు వరకు పుస్తకాలు ప్రచురింది.

తెలుగు సమాజంలో గత రెండు మూడు దశాబ్దా లుగా విప్లవోద్యమంతో పాటు స్త్రీవాద ఆదివాసీ దళిత బహుజన ఆత్మగౌరవ ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షల ఉద్యమాలు తెచ్చిన మలుపుల మంచి చెడ్డలను విశ్లే షించుకొనే సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యటం లక్ష్యంగా ‘మలుపు ప్రచురణలు’ ఏర్పడింది. అరుంధతీ రాయ్‌ వ్రాసిన మూడు వ్యాసాలతో ‘ధ్వంసమైన స్వప్నం’ ఈ సంస్థ ప్రచురించిన మొదటి పుస్తకం. ఈ పుస్తకానికి ‘తొలిమలుపు’ అనే శీర్షికతో సంపాదకవర్గం వ్రాసిన ముందుమాట అభివృద్ధి పేరిట జరిగే విధ్వం సాన్ని, దానికి వ్యతిరేకంగా జరిగే ప్రజా పోరాటాలపై ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న అణచివేతను విశ్లేషించే, నిరసించే స్వరాన్ని వినిపించే రచనల ప్రచుర ణను లక్ష్యంగా ప్రకటించింది. ఎక్కడా చెప్పకుండానే ఈ కాలపు సంఘర్షణాత్మక సమస్యలలో ముఖ్యమైన హిందూ ముస్లిమ్‌ వైరుధ్యాల విశ్లేషణల ప్రచురణ కూడా చేప ట్టింది ‘మలుపు’.ఈ పుస్తకాలలో ఆరు తప్ప మిగిలినవన్నీ అనువాదాలే. వాటిలో రష్యా దేశపు స్త్రీల అనుభవ కథనాల సంపుటి ఒకటి, గుగి వా థియాంగో రచనలు రెండు తప్ప మిగిలి నవన్నీ భారతదేశపు రచనలే. ముప్ఫయి రచనలలో పన్నెండు స్త్రీలవి. ఇవన్నీ చదివితే వర్తమాన దేశీయ రాజకీయార్థిక పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, అభి వృద్ధి మాయ, అణచివేత విశ్వరూపం, ప్రతిఘటన పోరా టాల గమనం- మొదలైన వాటికి సంబంధించిన సందే హాలు అనేకం తీరుతాయి. అవగహనకు స్పష్టత, సమ గ్రత సమకూడుతాయి. మనం ఒంటరిగా లేం అన్న భరోసా కలుగుతుంది. కల్లోల కాలంలో గుండెదిటవుతో జీవితాన్ని ఎదుర్కొనే ఉత్సాహాన్నిఇస్తాయి.ఏమైనా సారంలో సామ్రాజ్యవాద పెట్టుబడి అసహ్యకరమైన ముఖాన్ని బట్ట బయలు చేయటం, వామనుడి మూడో పాదంలా సర్వాన్ని ఆక్రమిస్తూ, భిన్న స్వరా లను అణచివేస్తున్న ఫాసిస్టు శక్తి గురించి సమా జాన్ని అప్రమత్తం చేయటం ఈ రచనలు అన్నిటికీ వెనక ఉన్న ఏకైక తాత్విక సూత్రం. కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి, కులమత ఆధిపత్యాలు, అణచివేతలు అందువల్లనే విడదీయరాని అంశాలుగా సామ్రాజ్య వాదంతో కలిపి చర్చకు వస్తుండటం ఈ రచన లలో చూస్తాం. చదువుతుంటే ఇవి ఒక దానికి ఒకటి కొనసాగింపుగానో, పూరకంగానో, మరొక కోణంగానో, ఎడతెగని మానవ మహాప్రస్థానంలో ఉప కథనాలుగానో కనబడతాయి. అర్థమవుతాయి.