కళింగాంధ్ర కవి బాలసుధాకర్‌ మౌళి. 62 కవితల సమాహారమీ పుస్తకం. నిశ్శబ్దం తాండవించిన చోట పెళ్ళున విరిగిపడతాడు.../లోలోపల కదిలి కదిలి విత్తు నుంచి మొలక చీల్చుకొచ్చినట్టు...అంటూ టైటిల్‌ కవిత ‘ఆకు కదలని చోట’ ఒక హెచ్చరికనూ, ఓ కొత్త ఉదయాన్నీ చాటిచెబుతుంది. ఆశావహ దృక్పథాన్నీ, అందవలసినదాన్ని అందనీయకుండా చేస్తున్న వైనాన్నీ, నిరసననీ హృద్యంగా తెలియజెప్పే కవితలివన్నీ.

-లలితా త్రిపుర సుందరి
 
ఆకు కదలని చోట కవిత్వం
బాలసుధాకర్‌ మౌళి
ధర: 116, పేజీలు: 136
ప్రతులకు: సిక్కోలు బుక్‌ట్రస్ట్‌, ఎంఐజి-100, ఎపిహెచ్‌బి కాలనీ, శ్రీకాకుళం-01