ఆత్మ దర్శిని

‘నువ్వు మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, పంచ జ్ఞానేంద్రియాలు కాదు...’ ఇలా నేతి, నేతి అని ప్రారంభించి అంతిమంగా స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది స్వామి మైత్రేయ ‘ఆత్మ దర్శనం’. సకల దుఃఖాలకూ మూలం అజ్ఞానం. ఆ చిమ్మ చీకటిని ఆత్మజ్ఞానమైన వెలుగుతో వదలగొట్టవచ్చని చెబుతారు మైత్రేయ. ‘నేను ఎవరు?’ అన్న ప్రాథమికమైన ప్రశ్నతో ప్రారంభించి వేదాంతపు లోతుల్ని తడిమారు ఈ గ్రంథంలో. పనిలోపనిగా రమణతత్వాన్నీ పరామర్శించారు. ఉపనిషత్తుల సారాన్ని విశదపరచారు. మాయ ముసుగులు తొలగించారు. ద్వైత అద్వైతాల మూలాల్లోకి వెళ్లారు. లౌకిక జీవితాన్ని కొనసాగిస్తూనే ఆత్మపథంలో ప్రయాణించాలని ప్రగాఢంగా ఆకాంక్షించేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

- కె.జె.ఆర్

ఆత్మ దర్శనం,

రచన: స్వామి మైత్రేయ

పేజీలు: 304,

వెల: రూ.350,

ప్రతులకు: కె.బి.లక్ష్మి,

ఫోన్‌: 9701 511618