‘అనాచ్ఛాదిత’ జీవన సత్యం

మానవ ఉద్వేగాలపై కప్పుకున్న తెరలను చించేసి, జీవన వాస్తవికతలో దాగిన బీభత్సాన్ని, స్వార్థాన్ని చూపించిన రచన ఝాన్సీ కొప్పిశెట్టి నవల ‘అనాచ్ఛాదిత కథ’. ఇదొక స్త్రీ జీవితపు విషాదాల సునామీ! ఈ నవలకు బలం, బలహీనతా ఇందులోని పాత్రలే! మధ్యతరగతి జీవన అగాథాలలో దాగిన స్వార్థాలు దృశ్య శకలాలుగా మారి మనల్ని ఢీకొంటాయి. ముఖ్యంగా నళిని పాత్ర ఓ పోరాట కెరటం. పడుతూ లేస్తూ గెలుపువైపు అడుగులేస్తుంది. పెళ్లి,ప్రేమ, పురుషాధ్యికతలపై ఆమె చేసిన వ్యాఖ్యానాలు మనని భయపెడతాయి.

వల్లూరి రాఘవరావు

అనాచ్ఛాదిత కథ (నవల),

రచన: ఝాన్సీ కొప్పిశెట్టి

పేజీలు: 198, వెల : రూ.150,

ప్రతులకు : 040-27678430