సమాజంలోని సమస్యలను తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ పాఠకులపై తనదైన ముద్రవేసిన రచయిత సలీం ఓ సున్నితమైన అంశాన్ని నవలకు ఇతివృత్తంగా మలచుకున్నారు. కథాగమనంలో ఎక్కడా ఆగకుండా, ఆద్యంతం చిన్న చిన్న అంశాలను కూడా హైలైట్‌ చేస్తూ సాగించారు నవలని. ప్రేమకు కులాలు, మతాలు అడ్డురావు. కాని పెళ్ళికి ఆ రెండూ చూస్తారు. కులమతాల అడ్డుగోడలని కాదని పెళ్ళి చేసుకున్నవారి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు... పిల్లల పేర్ల దగ్గర నుంచి పెళ్ళిదాకా తలెత్తే ఇబ్బందులు... సమాజంలో కులమతాల అంశం ఏవిధంగా తన ప్రభావాన్ని చూపిస్తూ, పాతుకుపోయి ఉందో...ఇత్యాది అంశాల సమాహారమే ‘అనూహ్య పెళ్ళి’. పాఠకుడి మనస్సుని స్పృశిస్తూ, ఆలోచింపచేస్తూ సాగే నవల అనడంలో సందేహం లేదు. 
- లక్ష్మీ నర్మద
 
 

అనూహ్య పెళ్ళి (నవల) 
రచయిత: సలీం 
పేజీలు: 256, వెల: 150/- 
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్‌- అన్ని బ్రాంచీలు, నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌. 
సలీం, ఫ్లాట్‌నెం. 306, జె.బి. అపార్ట్‌మెంట్స్‌, దోమలగూడ, హైదరాబాద్‌.